Thursday, 5 November 2026

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి
ఎమ్మెల్యే షిండే
బిచ్కుంద డిసెంబర్ 04 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని
బిచ్కుంద మండలంలో గల వాజిద్ నగర్ గ్రామంలో ఆదివారం నాడు ముత్యాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన శిఖర ఆవిష్కరణ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు హన్మంత్ షిండే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అందరూ కలిసి ఆలయ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాలు చేకూరాలని ఆయన అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ గ్రామస్తులు జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండేకి శాలువా కప్పి సన్మానం చేసి మెమొంటో అందజేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, తెరాస మండల అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, స్థానిక సర్పంచ్ అనూయా లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ బద్రి సాయిలు, ఎంపిటిసి బండ కింద సాయిలు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.