Tuesday, 3 November 2026

వివోఏల సమ్మె విరమింప చేయాలి. బెల్లంపల్లి బీజేపీ ఇంచార్జి కొయ్యల ఏమాజి డిమాండ్

.

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 27, (జనంసాక్షి )తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వివోఏలు చేస్తున్న సమ్మెను విరమింప చేయడానికి రాష్ట్రప్రభుత్వo చర్యలు తీసుకోవాలని, వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతాపార్టీ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. గత పదకొండు రోజులుగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల ఎదుట ఆందోళనలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గురువారం నెన్నేల, కన్నెపల్లి ఎం పి డి ఓ కార్యాలయాల ఎదుట వివోఏలు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివోఏ లు చాలీచాలని జీతాలతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని అన్నారు. 3900 రూపాయలతో వారు కుటుంబాలను ఎలా పోషించాలని ఆయన ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల  జీతాలు లక్షల్లో పెంచుకున్నారు కానీ వీరిని పట్టించు కోవడం లేదన్నారు. కేసిఆర్ ఆయన కుటుంబ ఆస్తులను పెంచుకోవడానికి తప్ప ఉద్యోగుల బాధలు చూసే తీరిక లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, కన్నెపల్లి మండల అధ్యక్షులు  బేరే రామన్న యాదవ్, గట్టు శివలింగు, సీనియర్ నాయకులు దూది ప్రకాష్, అజ్మీరా శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, నాగరాజ్, ఉద్యోగులు పాల్గొన్నారు.