Tuesday, 3 November 2026

శివశంకర్ స్వామికి నంది పురస్కారం

 

 

 

 

 

 

ఝరాసంగం( జనం సాక్షి ) మండలంలోని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ వైదిక పాఠశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న కుప్పా నగర్ గ్రామానికి చెందిన శివశంకర్ కు నంది పురస్కారం అందుకున్నారు. గురువారం హైదరాబాద్ శ్రీ త్రినయన సాంస్కృతిక కళానిలయంసాంస్కృతిక సేవా సంస్థ వారు శ్రీ జగద్గురు శంకరా జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలను అందిస్తున్న పూజారులు గుర్తించి పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో వేద పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శివ శంకర స్వామికి సేవలను గుర్తించి వేద వాచస్పతి అనే బిరుదు తో పాటు నంది పురస్కారాన్ని అందుకున్నారు. నంది పురస్కారాన్ని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, రాష్ట్ర బవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్,దేవాదాయ శాఖ   ముఖ్య సలాహధారు  మహంతయ్య స్వామి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.