హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పంచాయతీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా విశాఖలో తొలిసదస్సు జరగనుంది.




