విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు ఆత్మీయ సమ్మేళనం

 

 

 

 

మహబూబాబాద్ బ్యూరో-జులై9(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. సీనియర్ జర్నలిస్టు గుండోజు దేవేందర్ చారి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మొదట విశ్వకర్మ భగవాన్ కు గౌరవ వందనం చేసి అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, జాతి కోసం జర్నలిస్టులు చేయాల్సిన కృషి గురించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ఐకమత్యంతో లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని సూచించారు. అనంతరం స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు సనాతన చారి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు బండోజు ఉపేంద్ర చారి, ఆర్ఎంపి వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు గౌరోజు రవీంద్ర చారి అతిధులుగా పాల్గొని ప్రసంగిస్తూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సేవలు జాతి కోసం వినియోగించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్, స్టేట్ కమిటీ మెంబర్స్ గుండు దేవేందర్ శ్రీపాద శ్రీనివాసచారి, కోశాధికారి గుండోదు సుబ్రహ్మణ్యం శాస్త్రి, జనంసాక్షి బ్యూరో చీఫ్ రావూరి ప్రశాంత్, చంద్రబాబు సాంబశివ, విక్రమ్, ఎర్రోజ అశోక్, అనుగోజు పూర్ణచంద్రరావు, దూదికట్ల రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు