Thursday, 5 November 2026

విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

మెట్టుపల్లి పట్టణంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సర శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండగ పురస్కరించుకొని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం సంఘ అధ్యక్షుడు పులిమామిడి చంద్రయ్య , ప్రధాన కార్యదర్శి శంభోజి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అనంతరం అధ్యక్షులు, కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మనుమయ సంఘం తరఫున పట్టణంలో ప్రత్యేక పూజల అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో
విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు పులిమామిడి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి,శంభోజి శ్రీధర్ కోడిమ్యాల వెంకటస్వామి. కౌన్సిలర్ ఓజ్జల బుచ్చిరెడ్డి. ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్.కార్యవర్గం సభ్యులు చుతహరి రవి.వెంకన్న దేవయ్య
కార్యదర్శి శ్రీధర్, లక్ష్మణ్, గోవర్ధన్ వెంకట్ స్వామి .చిన్నయ్య, నవీన్. గంగాధర్, నాగభూషణం హనుమాన్లు, రాజేందర్, దామోదర్, లక్ష్మీరాజం,రాజశేఖర రాజు , విఠల్.గంగాదర్. మురళి,అంజయ్య. కుమర్.అశోక్.మరుతి.
శ్రీనివాస్ ,రాజు ,నరసయ్య రాములు ,శంకర్ ,గంగారాం తదితరులు పాల్గొన్నారు