Thursday, 5 November 2026

ఉమ్మడి మండల వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు.

ఉమ్మడి మండల వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు.
కోటగిరి మార్చి 22 జనం సాక్షి:-ఉగాది పర్వదినాన్ని ప్రశ్నించుకొని బుధవారం ఉమ్మడి కోటగిరి మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని బొడ్రాయి వీధిలో ఉన్న బొడ్రాయి భూమి లోపలికి కూరుకు పోవడంతో ఆ బొడ్రాయినీ గ్రామ పెద్దలు పూజా నిర్వహించి తిరిగి పునర్ ప్రతిష్టించారు.అనంతరం బొడ్రాయి వద్ద కాషాయ జెండాను ధ్వజారోహణ చేశారు.సాయంత్ర సమయంలో ఆయా గ్రామాలలోనీ ఆయా ఆలయాలలో పూజారుల సమక్షంలో గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు,అధికారులు,నాయకులు, ప్రజలకు పంచాంగ శ్రవణం పట్టించి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.