Thursday, 5 November 2026

విశ్వ భారతి పదవ తరగతి 16 బ్యాచ్ ల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

 

మోత్కూరు మార్చి 12 జనంసాక్షి : పది వరకు కలిసిన చేతులు..ఒక్కటై నడిసిన నడిసిన నడకలు ఓకే వేదిక పై ఓకే తాటిగా, ఓకే గొంతుకై కలిసిన అపూర్వ ఘట్టం ఆదివారం మోత్కూరు లో చోటు చేసుకుంది.మోత్కూరు విశ్వభారతి ఉన్నత పాఠశాల లో పది వరకు చదువుకున్న 16 బ్యాచ్ ల విద్యార్థులు స్థానిక సుమంగలి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా 16 బ్యాచ్ లకు బోధించిన 33 మంది ఉపాధ్యాయులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి వేదిక పైకి ఆహ్వానించారు.అలరించిన స్వాగత నృత్యం తో మొదలైన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల భోధనల గురించి, పాఠశాల జీవితం గురించి మాట్లాడిన తీరు ప్రతీ హృదయాన్ని కదిలించింది. ఆలోచింప జేసింది.16 బ్యాచ్ లకు సంబంధించిన 375 మంది విద్యార్థులు గురువులకు పాదాభివందనం చేస్తూ గురువులను సన్మానించారు. విశ్వభారతి పాఠశాల గుర్తుకు వచ్చేలా ఏర్పాటు చేసిన షో డాల్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఓకే సారి ఓకే పాఠశాల కి చెందిన 16 బ్యాచ్ ల విద్యార్థులు ఇలా చరిత్తలో నిలిచేలా గొప్ప కార్యక్రమం నిర్వహించి గురువులను జ్ఞాపికలు,గిఫ్ట్ లతో సన్మానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.విద్యార్థులు ఎదిగితే తల్లిదండ్రుల కంటే మొదటగా సంతోష పడేది ఉపాధ్యాయులే అన్నారు. ఉపాధ్యాయుల జీవితానికి వచ్చే పెద్ద అవార్డు విద్యార్థుల ఎదుగుదలే అని ఉపాధ్యాయులు పుట్ట వేణు,పురుగుల రాములు అన్నారు.పాఠశాల జీవితం, విశ్వభారతి సాధించిన ఫలితాలపై తెలుగు పండితులు గుమిడిల్లి వెంకన్న రాసి పాడిన పద్యాలు కట్టిపడేశాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా 16 బ్యాచ్ ల విద్యార్ధిని, విద్యార్థులు ఆడి పాడిన బతుకమ్మ, కోలాటం,డ్యాన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. సాయిలు,రవి చందర్,రాజు,వెంకన్న,మనోహర్,కొండల్ రావు,రవి,కృష్ణ, నిర్వాహకులు కోమటి మత్స్యగిరి,పురుగుల శ్రీను,కందుల విక్రాంత్, బొల్లెపల్లి శ్రావణ్, చోల్లేటి నరేష్,సోమేశ్,కొలిపాక గోపి,అక్బర్, కోలా శివ,నిలిగొండ సతీష్,సందీప్,శ్రీకాంత్ రెడ్డి, మాధవి, సువర్ణ,జ్యోతి,సంతోష,మాధవి,మంజుల,ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.