ఏలేటిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ
ఆరోపణలను ఖండించిన మహేశ్వర్ రెడ్డి
నిర్మల్,నవంబర్20(జనంసాక్షి): ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించకుండా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్‌రెడ్డి రూ.25 లక్షలు ఇస్తామన్నారని ఆరోపించారు. మధ్యవర్తి ద్వారా ఈ విషయంపై ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని చెప్పారు. సోమవారం రాత్రి నిర్మల్‌లోని గాజులపేటలో జరిగిన ఎంఐఎం సభలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మహాశ్‌రెడ్డి.. మజ్లిస్‌కి చెందిన కీలక వ్యక్తికి ఫోన్ చేశారని.. ఒవైసీ సభను నిలిపివేస్తే రూ.25లక్షల విరాళం ఇస్తానని ఎరవేశారని, దీనికి సంబంధించిన రికార్డింగ్ తన దగ్గర ఉందని అసద్ చెప్పారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి రూ.25లక్షలతో తన మద్దతుదారులను, ప్రజలను కొనగలరా? అని ప్రశ్నించారు. డబ్బుతో తనను ఎవరూ సొంతం చేసుకోలేరన్నారు. కాంగ్రెస్ తనకు వెలకట్టాలని చూసిందని మండిపడ్డారు. అయితే ఇదంతా పచ్చి అబద్దమని నిర్మల్ కాంగ్రెస్ అబ్యర్తి ఏలేటి మహేశ్ర్ రెడ్‌ఇ ఖండించారు. అసద్ లాం/-టి వారు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలా చేయాల్సిన అసవరం కూడా తమకు లేదన్నారు. అసదుద్దీన్ చేసిన ఆరోపణల్ని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. నిర్మల్‌లో మైనారిటీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారని, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డే నిర్మల్‌లో ఒవైసీతో సభ పెట్టించారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఒవైసీకి తగదన్నారు. నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించకుండా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్‌రెడ్డి తమకు రూ.25 లక్షలు ఇస్తామన్నారంటూ ప్రచార సభలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.




