Thursday, 5 November 2026

విూడియాపై ఆంక్షలపై వైకాపా మండిపాటు

హైదరాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: విూడియా స్వేచ్ఛను తెలంగాణ సర్కారు అడ్డుకోవాలని  చూస్తుండటంతో తెలంగాణ వైఎస్సార్‌ సీపీ మండిపడింది. విూడియాపై తెలంగాణ సర్కార్‌ ఆంక్షలు విధించడం దుర్మార్గమని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగంలు విమర్శించారు. సచివాలయంలో ఆక్షలు ఏంటని వారు ప్రశ్నించారు. తెలంగౄణ ఉద్యమంలో వారిని వాడుకుని ఇప్పుడు వారిపైనే ఆంక్షలు విధించడం దారుణమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విూడియా అంటే భయపడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్‌ కు విూడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. విూ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకుని పాలనపై దృష్టి పెట్టాలన్నారు.సచివాలయంలో విూడియాకు ‘నో ఎంట్రీ’… అంటూ గతంలో ఎన్నడూ లేని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రోజువారీ పరిపాలనా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తున్నారనే సాకుతో పాత్రికేయులను లోపలకు రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తుండటంతో సర్వత్రా  విమర్శలకు దారి తీస్తోంది. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *