Thursday, 5 November 2026

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు అమోఘమన్న నాయిని

గ్రేటర్‌లో తప్పకుండా గెలుస్తామన్న కవిత
హైదరాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
:  చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని మంచి నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్నరని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అనేక ప్రజా సంక్షేమ నిర్ణయాలతో బంగారు తెలంగాణ లక్ష్యంగా కెసిఆర్‌ సాగుతున్నారని అన్నారు.  కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన తాజా, మాజీ కార్పొరేటర్లు శుక్రవారం తెలంగాణభవన్‌లో పలువురు మంత్రుల సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవానే నడుస్తుందన్నారు.  సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసి జనం పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు.  మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా ప్రజల సంక్షేమం కోసం అమలుపరుస్తున్నం. కళ్యాణలక్ష్మీ ఇందుకు ఒక ఉదాహరణ. హైదరాబాద్‌ రూపు రేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నరు. సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్‌కు అమోఘమైన స్పందన లభిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.  తెలంగాణలో ఉన్నవారంతా ఇక్కడి వారేనని, తెలంగాణ బిల్లు పాసైన రోజే కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు వస్తున్నారని నాయిని పేర్కొన్నారు.ఇదిలావుంటే తెలంగాణలోని గులాబీ జెండా తప్ప మరేజెండా కనిపింపచడం లేదని, గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమాజీగూడ మాజీ కార్పోరేటర్‌ మహేష్‌ యాదవ్‌ ఎంపీ కవిత, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆంధ్రా పాఠ్యపుస్తకాలలో తెలంగాణ చరిత్ర పెట్టనని చంద్రబాబు అంటున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే.. చంద్రబాబే చరిత్రలో లేకుండా పోతారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *