Tuesday, 3 November 2026

వి ఎం బంజర్ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్దులకు వీడ్కోలు సమావేశం

పెనుబల్లి, మార్చ్ 28(జనం సాక్షి)
పెనుబల్లి మండలం వంగాముత్యాలబంజర్ ఉన్నత పాఠశాలలోమంగళవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంనిర్వహించారు, ప్రధానోపాధ్యాయులు బి. నరసింహా రావు అధ్యక్షతన జరిగిన సమావేశంనకు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సీహెచ్ వెంకటేశ్వరరావు,విశిష్ట అతిధులు గా స్థానిక ఎం పి టి సి వంగా ఝాన్సీనిరంజన్ గౌడ్, ఎస్ ఎం సీ చైర్మన్ జి.కృష్ణ, సభ్యులు వంగా చంద్ర శేఖర్, పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టి ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్,టి. రాములమ్మ,జే. పుల్లయ్య, వంగా నిరంజన్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేశ్వరరావుమాట్లాడుతూ పరీక్షలు బాగా రాసి, అందరూ ఉత్తీర్ణత సాధించాలని, భవిష్యత్తు గొప్పగా మలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు,క్రమ శిక్షణ,సమాజం పట్ల బాధ్యత అలవరసడం చేస్తున్నామని వివరించారు.మన ఊరు-మన బడి ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని,వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. లింగ గూడెం ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాసరావు,ఉపాధ్యాయులు చల్లా వెంకేటేశ్వరరావు, వివి రామారావు,వై. శ్రీనివాస్, వనమా నాగేశ్వరరావు, సోమ్లా నాయక్,రాజు, ఉమారాణి, పద్మ లత తదితరులు ప్రసంగించారు, అనంతరం విద్యార్థుల చే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగింది.