వీణవంక ఏప్రిల్ 11 (జనం సాక్షి)వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ అవర్ణలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మోటం వెంకటేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197 జయంతి ని వీణవంక బిసి సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూపూలే మహారాష్ట్ర లోని సితార జిల్లా లో 1827 సం.. లో జన్మించాడు అతని జీవితం అంత బ్రాహ్మణ ఆధిపత్యా పై సాంఘిక అసమానతలను రూపు మాపాలని . బాల బాలికలకు విద్య హక్కు కల్పించాలి అని శతిసహగమనం మూఢనమ్మకాలను రూపుమాపాలని మనుధర్మం పై మరియు బ్రాహ్మణుల పై తిరుగుబాటు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. వారి ఆశయాలకు అనుగుణంగా తిరుగుబాటు చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లబహుజన రాజ్యాధికారం సాధించవచ్చు. ఈ కార్యక్రమంలో. బిసి సంక్షేమ సంగం జిల్లా కార్యదర్శి దొమ్మటి రాజమల్లు.డివిజన్ అధ్యక్షుడు బుర్ర కుమార్. మాజీ జడ్పిటిసి దాసరపు ప్రభాకర్. మారముళ్ళ కొమురయ్య.మాజీ ఎంపీటీసీ నల్లగొని రమేష్. బత్తిని నరేష్. కొలిపాక వెంకటేష్. పర్లపెల్లి స్వామి.రాచపల్లి కుమార్. కురిమిడ్ల శ్రీనివాస్.కంకల సంతోష్.అంబాల మధునయ్య. ప్రకాష్ గుండేటి సుధాకర్ మర్రి రవి తోపాటు తదితరులు పాల్గొన్నారు




