రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 11. (జనంసాక్షి). 25 వ వార్డు కౌన్సిలర్ కుడిక్యాల రవిని పద్మా నగర్ ధరణి సమైక్య సంఘం సభ్యులు మంగళవారం ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని సూచించారు. ఆత్మీయంగా సత్కరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్పి విద్య, నర్మద, సంధ్య, పద్మ, లక్ష్మి, లావణ్య ,స్వప్న, లత సభ్యులు పాల్గొన్నారు.




