Tuesday, 3 November 2026

వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం విద్యార్థులు ఇష్టపడి చదవాలి కష్టపడి కాదు

వీణవంక మార్చి 2( జనం సాక్షి )వీణవంక స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవాలని కష్టపడి కాదని అన్నారు. చదువుతో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్ అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం రోజున ఇంటర్మీడియట్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులు సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయగా ఈ వీడ్కోలుకు ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజల్వన చేసి వీడ్కోలు సమావేశాన్ని ప్రారంభించాగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సెల్ ఫోన్లకు టీవీ లకు వ్యసనాలకు దూరంగా ఉండేటట్టు తల్లిదండ్రులు చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో రాణించాలంటే విద్యార్థులు భయాన్ని వీడి ముందుకు సాగాలని విద్యార్థులు ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని బయందోళనకు గురై అగా యిత్యాలకు పాల్పడవద్దని అన్నారు.ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల దీటుగా ప్రభుత్వం విద్యా సంస్థలో మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యాసించాలని అన్నారు రానున్న వార్షిక పరీక్షలో ప్రతిభ కనబరిచి. జిల్లా స్థాయిలో సత్తా చాటి కళాశాలకు తోపాటు మన తల్లిదండ్రులకు విద్యతోపాటు మంచి పేరు తీసుకురావాలని అన్నారు అనంతరం ఇటీవల నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థులు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ విడపు శ్రీనివాస్. కళాశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి. కళాశాల అధ్యాపకులు తిరుపతి. శోభన్ బాబు. రాజేందర్. రవీందర్. కరుణ. సుమలత. తో పాటు తదితరులు పాల్గొన్నారు