Tuesday, 3 November 2026

జగ్గంపేటలో రెండో విడత కంటి వెలుగు ప్రారంభం….

చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండల పరిధిలోని జగ్గంపేట గ్రామంలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ  వినోధ దుర్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లడుతు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గ్రామీణ పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఇటువంటి కార్యక్రమన్ని ప్రజలకు అందించిన రాష్ట్ర ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమన్ని గ్రామ ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పట్లోళ్ల మాంతప్ప. ప్రోగ్రాం మెడికల్ ఆఫీసర్ డా. శ్రీలక్ష్మి. మండల బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల అశోక్ రెడ్డి. పంచాయతీ కార్యదర్శి యాదగిరి. ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి. మండల బిఆర్ యస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సికింద్రాపురం పోచయ్య.ఏయన్ఎం పారమ్మ. అంగన్ వాడి టీచర్ షహనాజ్ బేగం.వార్డ్ మెంబర్స్ ఎల్లయ్య. రవి. ఆశ వర్కర్ అనిత.వివోఏ మంగమ్మ. మండల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని క్వాలిట్ కంట్రోల్ ఆఫీసర్ డా. ఆదర్శ్. మండల స్పెషల్ ఆఫీసర్ పద్మ సందర్శించారు