Tuesday, 3 November 2026

వీణవంక మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

వీణవంక, జూన్ 02( జనం సాక్షి ) వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు పూలతో అందంగా అలంకరించి, ముగ్గులు వేసి, జాతీయ జెండాలను కట్టారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజయ్య, సింగిల్ విండో కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్ రెడ్డి . గ్రామపంచాయతీ కార్యాలల్లో సర్పంచ్లు జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే సాధించిన ఆభివృద్ధిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మా వనమాల సాదవరెడ్డి, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్, మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి. అగ్రికల్చర్ ఏవో గణేష్. ఎంపీఓ ప్రభాకర్, నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, సంఘ సమ్మయ్య. ఒడ్డెపెల్లి భూమయ్య, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.