Tuesday, 3 November 2026

వీవోఏల అరెస్టు.

బెల్లంపల్లి, మే 29, (జనంసాక్షి )
రాష్ట్ర వ్యాప్తంగా గత 45 రోజులుగా సమ్మె చేపట్టి రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి ప్రభుత్వం స్పందించక పోవడంతో చలో ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమానికి తరలి వెళుతున్న వీవోఏలను సోమవారం బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా వీవోఏల యూనియన్ నియోజకవర్గ అధ్యక్షురాలు రజిత మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో అరకొర బతుకులు గడుపుతున్నామని, వీవోఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టామన్నారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళితే ఇలా అక్రమంగా అరెస్టులు చేయడం దారుణం అన్నారు. ఈకార్యక్రమంలో వీవోఏ యూనియన్ నాయకులు దుర్గం మల్లేష్, వీవోఏ పాల్గొన్నారు.