కంటోన్మెంట్ జనం సాక్షి మే 29 కంటోన్మెంట్ మూడువ వార్డ్ లో మాజీ బోర్డ్ సభ్యులు అనిత ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనుందని, కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో కూడా జరగబోతుందని అలాగే రానున్న ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి ఓటు వేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరింత తోడును బిఆర్ఎస్ పార్టీకి అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్లు మన్నె కిశాంక్, గజ్జెలనాగేష్,మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత శ్రీగణేష్, బోర్డ్ మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్,సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్,పెద్దల నర్సింహా,ప్రభుగుప్త,మురళీ యాదవ్,రాజు సింగ్,ప్రవీణ్ యాదవ్,పరుశురాం,నర్సింగ్, బంటీ,సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
మూడో వార్డులో ఘనంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న కంటోన్మెంట్ ఇంచార్జ్ మర్రి




