నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.నేరేడుచర్ల పట్టణానికి చెందిన చింతల శ్రీకాంత్, వేన దంపతుల కుమార్తె చింతల భవిష్య బ్రహ్మణి,పుట్టినరోజును పట్టణంలో సహృదయ వృద్ధాశ్రమంలో మంగళవారం జరుపుకున్నారు.ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు బోజనాలు ఏర్పాటు చేశారు. వృద్దులకు పండ్లతో బాటు మిఠాయిలు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సోము సావిత్రమ్మ మాట్లాడుతూ తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను వృద్ధుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకుంటూ వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ వృద్దులు మరియు యుగంధర్,శివ పాల్గొన్నారు.




