నాగర్ కర్నూల్ బ్యూరో,మే 23 జనంసాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యా ర్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.విద్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు,కళాశాల కు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని,డిగ్రీ తర్వాత జరగబోయే అన్ని పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి కళాశాలలో చదివే మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వీడ్కోలు సమావేశం సందర్భంగా కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ కృష్ణయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు,శివ,రామకృష్ణ, నాగలింగం,డాక్టర్ సుష్మ, రాధా కుమారి, రవికుమార్,రమేష్, కృష్ణతేజ,యాదగిరి, హమీద్, మహేష్, పాండు,మనోజ్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది బాలస్వామి,కురుమయ్య, అక్బర్, నాగేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పాలెం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘనంగా వీడుకోలు. -విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. -ప్రిన్సిపాల్ విద్యారాణి.




