వృద్ధురాలి చెవులు కోసి దిద్దులు దొంగలింత

రంగారెడ్డి : మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వృద్ధురాలి చెవులు కోసి చెవి దిద్దులు, మంగళసూత్రం లాక్కెళ్లిపోయారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.