హైదరాబాద్, మార్చి 25 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 10978 పాఠశాలల్లో 5.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 2614 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం




