హైదరాబాద్: తెలంగాణ శాసనసభలోని మీడియా పాయింట్ వద్దకు వస్తున్న తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతకరమని ఈ సందర్భంగా తెదేపా నేతలు ఆరోపించారు. తమను అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులపై నేతలు మండిపడ్డారు. సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డి, వివేక్ణ్‌ొడ్, రాజేందర్‌రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద పోలీసులు అడ్డుకోవడమేంటని ఎమ్మెల్యే సండ్ర ప్రశ్నించారు. తమను శాసనసభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారన్నారు. మేం చేయని తప్పును అంటగట్టి సభ నుంచి బయటకు నెట్టారని, సమస్యలపై మాట్లాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని, ఇప్పటికైనా సీడీలను బయటపెట్టి వాస్తవాలు వెల్లడించాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజుగా ఎర్రబెల్లి అభివర్ణించారు. యువకుల ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ సాధించుకున్నామన్నారు.
తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలు-పోలీసుల మధ్య వాగ్వాదం




