వృద్ధులకు దుప్పట్లు పంపిణి చేసిన ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ మోతె నవత కిరణ్వృద్ధులకు దుప్పట్లు పంపిణి చేసిన ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ మోతె నవత కిరణ్
జనం సాక్షి, చెన్నరావు పేట
మండలంలోని లింగాపురం గ్రామంలో నర్సంపేట పట్టణంలోని జనని నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ మోతె నవత-కిరణ్,రంగారెడ్డి తను పుట్టిన గ్రామంలోనీ 150 మంది వృద్ధులకు చలి కాలంలో ఇబ్బంది పడకుండా దుప్పట్లు పంచి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ నవత మాట్లాడుతూ సొంత గ్రామంలోనీ వృద్ధులకు వైద్య సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని, లింగాపురం గ్రామస్తులకు తమ హాస్పిటల్లో ఎప్పుడైనా ఉచితంగా బిపి,షుగర్ వంటి పరీక్షలు చేపించి కావలసిన మందులను ఉచితంగా అందజేస్తామని, ఏదైనా వైద్య సహాయంకోసం గ్రామస్తులు ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపురం సర్పంచ్ తప్పేట రమేష్,వార్డ్ మెంబెర్ బరిగల రాములు,వెనకతల ఇంద్రయ్య,బోడ రమేష్, నాగరాజు,మానస, గ్రామస్తులు పాల్గొన్నారు.
వృద్ధులకు దుప్పట్లు పంపిణి చేసిన ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ మోతె నవత కిరణ్వృద్ధులకు దుప్పట్లు పంపిణి చేసిన ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ మోతె నవత కిరణ్




