Thursday, 5 November 2026

ధరణి పోర్టల్ రద్దు చేయాలి

ధరణి పోర్టల్ రద్దు చేయాలి
*రైతుల ఇబ్బందులు తీర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దిగంబర రావు
రేగోడ్ //జనం సాక్షి // నవంబర్:
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణనా తీరంగా మారాయని వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని రేగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ రావు అన్నారు. టి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మాజీఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గురువారం రేగోడు తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే రైతు రుణమాపీ ఏకకాలంలో చేయాలన్నారు. ధరణి పోర్టల్ కారణంగా అర్హులైన రైతుల పేర్లు గల్లంతయాయని ధరణి పోర్టల్ కారణంగా అనేకమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు మూడెకరాల భూమిని ప్రభుత్వం అందజేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిలింగ్ యాక్ట్ ను తెచ్చి పేద రైతులకు భూమిని అందజేసిందని ప్రాజెక్టులను నిర్మించి రైతాంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనిని వారు కొనియాడారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను తాసిల్దార్ లక్ష్మణ్ కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో
జెడ్పిటిసి యాదగిరి, కోఆప్షన్ సభ్యులు చోటుమియా ఎంపిటిసి నాగిరెడ్డి, మాజీ పీఎస్ చైర్మన్ శ్యామ్ రావు కులకర్ణి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపనపల్లి శంకరప్ప నాయకులు,గున్న సంగమేశ్వర్, కమ్మరి కుమార్ కుమారస్వామి , సంగ్యానాయక్, పీరియా నాయక్, దర్శన్, మైనార్టీ నాయకులు దూదేకుల అక్బర్, మహబూబ్,తదితరులు పాల్గొన్నారు