Monday, 2 November 2026

వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఎన్సిసి కంపెనీ..! – జడ్పీ చైర్మన్ పుట్ట మధును కలిసి గోడు వెళ్లబుచ్చుకున్న ఎన్సిసి కార్మికులు

జనంసాక్షి, మంథని : గత నాలుగు సంవత్సరాలుగా ఓసిపి 2 ఆఫ్ లోడింగ్ ఎన్సిసి కంపెనీ లో వోల్వో డ్రైవర్స్ హెల్పర్స్ గా సంవత్సరాల నుండి పనిచేస్తున్నా తమకు ప్రతి సంవత్సరం 1000 రూపాయాల చొప్పున జీతం పెంచాల్సి ఉన్న ఎన్సిసి యాజమాన్యం వెట్టి చాకిరి చేస్తున్నదని ఎన్సిసి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు జడ్పీ చైర్మన్ పుట్ట మధు ముందు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. బుధవారం మంథనిలోని రాజ గృహలో వారు రచ్చపల్లి సర్పంచ్ కనవేన శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ ను కలిశారు. టెండర్ పూర్తి అవ్వడం వల్ల మార్చి నెల నుండి ప్రభవిత గ్రామాలు తప్ప చుట్టు పక్కల వేరే గ్రామల వాళ్ళను ఉద్యోగం లోంచి తొలగించడం జరిగిందన్నారు. పలు సమస్యల పరిష్కారానికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని కలిసి సమస్యలు విన్నవించటం జరిగింది. వెంటనే జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ స్పందించి ఎన్సిసి యాజమాన్యం ప్రభాకర్ తో మాట్లాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి వోల్వో డ్రైవర్స్ హెల్పెర్లు తదితరులు పాల్గొన్నారు.