జనంసాక్షి, రామగిరి : సింగరేణి పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో బాగంగా పన్నూర్ గ్రామ పంచాయతీ లో వివిధ స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్స్ మంజూరు చేయాలని స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి కోరగా.. పన్నూర్ మూడవ వార్డు లో మరొకటి పన్నూర్ ఎక్స్ రోడ్ వద్ద రెండు పబ్లిక్ టాయిలెట్స సింగరేణి యాజమాన్యం మంజూరు చేసిన సందర్భంగా అట్టి స్థలం లో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత సింగరేణి అధికారులు కలిసి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, రామగిరి జెడ్పీటీసీ మ్యాధరవెని శారద కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, ఎంపీటీసీ చింధం మహేష్, ఉపసర్పంచ్ దామెర శ్రీనివాస్ యాదవ్, ఎస్ ఓ 2 రఘుపతి, ఎస్ ఈ పద్మ రాజు, పర్సనల్ డిపార్ట్మెంట్ విల్లాస్ పోధర్, వార్డు సభ్యులు పెరుమాండ్ల లావణ్య ప్రసాద్, తన్నీరు ప్రదీప్, కాంట్రాక్టర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పన్నూరులో పబ్లిక్ టాయిలెట్స్ మంజూరు




