Monday, 2 November 2026

వెల్లడైన బ్యాంకు సమాచారంలో భారతీయుల పేర్లు


స్విస్‌ బ్యాంకు మాజీ ఉద్యోగి
జూరిచ్‌/ దిల్లీ: తాను 2008 సంవత్సరంలో బహిర్గతపరిచిన బ్యాంకు సమాచారంలో కొందరు భారతీయుల పేర్లూ ఉన్నట్లు ప్రజా వేగుగా మారిన మాజీ బ్యాంకు ఉద్యోగి రుడాల్ఫ్‌ ఎల్మర్‌ చెప్పారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. జాబితాలో అమెరికాతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, భారత్‌లకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయని చెప్పారు. సైమన్‌ ఐలాండ్స్‌లో స్విస్‌కు చెందిన జూలియస్‌ బేయర్‌ బ్యాంకుకు చెందిన ఉద్యోగి రుడాల్ఫ్‌… కొందరు ఖాతాదారుల సమాచారాన్ని దొరకబుచ్చుకుని బయటకు వెల్లడించారు. 2011లో వికీలీక్స్‌కు సమాచారాన్ని అందించిందీ ఆయనేననే అనుమానాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *