బోయిన్ పల్లి మే 06 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో వేతనాలు పెంచాలని కోరుతూ వివో లు సమ్మె బాటపట్టారు, శనివారం ఐకేపి కార్యాలయం ముందు వివోలు సమ్మె చేపట్టారు, వివోలోసంఘం నాయకురాలు మాట్లాడుతూ తాము గత 20 ఏళ్లుగా మహిళా సంఘాల కు పని చేస్తున్నామని 250 రూపాయలతో పని చేస్తున్నామని ప్రస్తుతం ఇస్తున్న 3900 వేతనంతో పూట గడవడం కష్టంగా మారిందని తమ వేతనాలను 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రమాద బీమా ఐదు లక్షల కేటాయించాలని, ఆరోగ్య భీమా చేపట్టాలని డిమాండ్ చేశారు, శనివారం నుండి విధులను బహిష్కరించి వేతనాలను పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.




