Wednesday, 4 November 2026

అభివృద్ధి పనులను ఆపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డం కాలు సృష్టించిన పనులు ఆపే ప్రసక్తే లేదు

 

 

 

 

 

జనం సాక్షి నర్సంపేటకుల సంఘ భవనాలపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. నర్సంపేట అభివృద్ధి నిరోధకులుగా ఉండి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనులు చేసి ప్రజల చూపెడతాం బి
ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట నారాయణ అన్నారు. శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలం నుండి కుల సంఘాల భవనాలు నిర్మాణాలు జరగకుండా ఆపింది నువ్వే ఇప్పుడు మరొక దొంగ నాటకంతో ఆపు పోయే ప్రయత్నం చేస్తున్నది నువ్వే కుల సంఘ భవనాలు నిర్మాణాలు జరుగుతే ఎక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పేరు వస్తదో అనే కుటిల బుద్ధితో కోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ నాయకుడు కాదా దీనికి సమాధానం చెప్పాలి. అన్నారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోర్టులో కేసు ఉండగా ఎస్ డి ఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి 22 కుల సంఘ భవనాలకు టెండర్ పిలిసి ముగ్గు పోసి నిర్మాణాలు జరుగుతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడడం సరికాదని ఏ జీవోలో కుల సంఘానికి ఉన్న స్థలము మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాలని లేదని అది కేవలం ఆ యొక్క సంఘం నిర్మాణం అయ్యేంతవరకే మున్సిపల్ పర్యవేక్షణ ఉంటుందని తదుపరి ఏ కులానికి కేటాయించబడిందో ఆ కులం వారే నిర్వహణ చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పిన తప్పుడు సమాచారం బయటకి చెప్పి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్ని కుల సంఘాల బాంధవులు గమనించాలని తెలిపారు. ఏ కుల సంఘం నాయకులైన మీ దగ్గరికి వచ్చి మా స్థలం మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటున్నారని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికే గౌడ సంఘం పద్మశాలి సంఘం మైనారిటీ భవనాల నిర్మాణానికి టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభమైనవి ఆయన పేర్కొన్నారు అభివృద్ధి జరుగుతుంటే ఓర్చుకోలేని కాంగ్రెస్ నాయకులు చోట మోట నాయకులతో కోర్టు మెట్లు ఎక్కి స్టేలు పట్టుకొస్తున్నారని ఇలా ఇప్పటికే డివిజన్లో రైతంగానికి ఉపయోగపడే గోధుమల నిర్మాణంలో, జిల్లా ఆసుపత్రి నిర్మాణంలో, అంగడి సెంటర్ లో జరుగుతున్న నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ ,ప్రాజెక్టుల విషయంలో ఇలా అన్నిట్లో స్టే లు తీసుకువచ్చి అడ్డుపడుతున్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పాకాల, రంగయ్య చెరువు లకు గోదావరి జలాలను తీసుకువస్తే ఎమ్మెల్యే కాలు కడిగి నెత్తిలో పూసుకుంట అని చెప్పిన మీ నాయకుడు ఎక్కడ పోయాడు రెండు సంవత్సరాల నుండి పాకాల రంగయ్య చెరువులకు నీరు సమృద్ధిగా వచ్చి రెండు పంటలు పండే విధంగా చేసింది ఎమ్మెల్యే గారు కాదా అని ప్రశ్నించారు. కుల సంఘాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే ఎన్నికలలోపే శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో అన్ని భవనాలు పూర్తిచేసి ఆయా కుల సంఘాల చేతిలో పెట్టుతామని అన్నారు 600 కోట్లతో సిసి రోడ్లు పనులు పూర్తయ్యాయని మిగతా పనులు త్వరలో చేపడతామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుంటి కిషన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మినుముల రాజు, కౌన్సిలర్ దార్ల రమాదేవి,పాషా, అధ్యక్షుడు గోనె యువరాజు పట్టణ కార్యదర్శి వెన్నుముద్దుల శ్రీధర్ రెడ్డి నాయకులు రావుల సతీష్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్ జాగృతి వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.