Wednesday, 4 November 2026

వేములవాడ రాజన్నకి భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గణపతి నవరాత్రోత్సవాలు కావడంతో ఉదయాన్నే ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తలనీలాలిచ్చి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో వినాయకుడికి అభిషేకాలు జరిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *