Wednesday, 4 November 2026

వేర్వేరు ఘనటలో నలుగురు విద్యార్థుల దుర్మరణం

పదో తరగతి విద్యార్థి , ముగ్గురు వైద్య విద్యార్థుల మృతి
హైదరాబాద్‌,మార్చి 25(జ‌నంసాక్షి): రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థి ఆదిల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక కరీంనగర్‌ జిల్లాలోని తీగలగుట్టపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వైద్య మృతి చెందారు. మృతి చెందిన వారిని వైద్య విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *