హైదరాబాద్,మార్చి 25(జనంసాక్షి): సాయంత్రం వాయిదా అనంతరం తెలంగాణ శాసనసభ తిరిగి ప్రారంభం కాగానే మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదయం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జానా సుదీర్ఘంగా మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో అంతా సంయమనంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. ఎవరు కట్టుతప్పినా మంచిది కాదన్నారు. తనకు విపక్ష పాత్ర కొత్తదే అయినా తమాయించుకుని దీనిని సమర్థంగా నిర్వహించేందుకు పనిచేస్తున్నానని అన్నారు. సభలో ఏ పార్టీ నేతలైనా హుందాగా వ్యవహరించాలని జానారెడ్డి సభ్యులకు సూచించారు. తూ ఏ సభ్యులైనా అసభ్య పదజాలం వాడితే..వారిని వారించాలని సూచనలు చేశారు. సభలో అటు అధికార పక్షం సభ్యులు, ఇటు విపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. సభలో ప్రతిపక్ష పాత్రను సరిగా నిర్వర్తించేందుకు కృషిచేయాలని పార్టీ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీలను అవమానించేలా మన వైఖరి ఉండకూడదని సూచించారు. సభలోకి వచ్చిన కొత్త సభ్యులు తొందరపడి మాట్లాడుతున్నారని అన్నారు. తమ పార్టీ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడింది సబబు కాదని అందుకే తాను స్పందించానని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఏ పార్టీ సభ్యులైనా అసభ్య పదజాలం వాడితే… వారిని వారించాలని, కెమెరా దృశ్యాలు చూసి ఎవరేం మాట్లాడారో పరిశీలించాలని, సభలో అధికారపక్ష, విపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. సభలో ప్రతిపక్షపాత్రను సరిగా నిర్వర్తించేందుకు కృషి చేయాలని, ఇతర పార్టీలను అవమానించేలా వైఖరి ఉండకూడదని, సభలో వచ్చిన కొత్త సభ్యులు తొందరపడి మాట్లాడుతున్నారని, అధికారపక్ష సభ్యులు కూడా సంయమనం పాటించాలన్నారు. తన రాజకీయ జీవితంలో విపక్షపాత్ర పోషించడం కొత్తేనని, సభ హుందాగా నడవాలని ఎప్పుడూ కోరుకుంటున్నామని, సభ సరిగా నడిచే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, సభలో ఎల్లవేళలా ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లాలన్నారు. అంతా కలసి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్దికి పాటుపడాలన్నారు.




