యైటీంక్లయిన్ కాలనీ మే 04 (జనంసాక్షి):వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని
ఏరియా జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ అన్నారు.గురువారం 8 ఇంక్లైన్ కాలనీలోని డా.ఎపిజే అబ్దుల్ కలాం స్టేడియం నందు వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆర్జీ-2 ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు.
ఆటల వల్ల మానసికోల్లసం పెంపొందుతుందని, నిష్ణాతులైన శిక్షకులచే ఫుట్ బాల్, వాలీ బాల్ మరియు బాస్కెట్ బాల్ క్రీడలలో 25 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సింగరేణి ఉద్యోగుల పిల్లలు పరిసర ప్రభావిత గ్రామాల పిల్లలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు అయిలి శ్రీనివాస్, ఎస్ఓటుజిఎం అబ్దుల్ సలీం, డిజిఎం పర్సనల్, అధికార ప్రతినిధి జి.రాజేంద్రప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి.రమణ, స్పోర్ట్స్ ఆనరబుల్ సెక్రటరీ, డివైపిఎం వేణుగోపాల్, స్పోర్ట్స్ సమన్వయకర్త బెక్కం రవి, ఓరం సురేష్, నర్సింహారెడ్డి, దేవారెడ్డి, క్రీడాకారులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు




