Thursday, 5 November 2026

వైఎస్‌కు రు. 500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి చెప్పారు

తెదేపా నేత పయ్యావుల కేశవ్‌
హైదరాబాద్‌ : వైఎస్‌కు రూ. 500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి జనార్దన్‌రెడ్డి సీబీఐ విచారణలో అంగికరించారని, గాలి ఇచ్చిన రూ. 500 కోట్లను వైఎస్‌ ఎన్నికల ఖర్చుగా వినియోగించారని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖర్చును తానే భరించానట్లు గాలి వాంగ్మూలం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. ప్రచురించారని, సీబీఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టుకు వస్తుందని పయ్యావుల వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *