Thursday, 5 November 2026

వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదు.

వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదు..

– అదనపుకలెక్టర్ జీ సంధ్యా రాణి

– ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపు

– కోచ్ లు ప్రత్యేక దృష్టి సారించాలి

హన్మకొండ బ్యూరో చీఫ్ 22 నవంబర్ జనంసాక్షి

వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని అదనపు కలెక్టర్ జీ సంధ్యా రాణి అన్నారు, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పుర్కరించుకొని మంగళవారం రోజున జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో జెండా ఊపి ప్రారంభించి అనంతరం ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఏదైనా సాధించగలమనే సంకల్పం ఉంటే ఎటువంటి వైకల్యమైనా సంకల్పం ముందు దాసోహమేనని అన్నారు.
వైకల్యంతో మానసికంగా కృంగిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారని, అయితే మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదని, మనో ధైర్యమే విజయానికి అసలైన సాధనాలని అన్నారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం మరియు వారి సృజనాత్మకతను వెలికి తీసుటకు ప్రభుత్వం పథకాల రూపకల్పనకు కృషి చేస్తుందని, జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు,
దివ్యాంగుల అభిరుచికనుగుణంగా కోచ్ లు కూడా వారికి సమాంతర గమనం చూపాలని అన్నారు.
ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితా రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, క్రీడా సాంస్కృతిక రంగాలతో పాటు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు,
ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ గెలుపొందిన క్రీడాకారులకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు.
ఈ క్రీడోత్సవాల సందర్భంగా రన్నింగ్,చేస్, క్యారమ్, జావెలిన్ త్రో, సీనియర్ జూనియర్ విభాగాల క్రీడలు నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ డిజెబుల్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ కే అనితా రెడ్డి, సీడీపివోలు పి స్వరూప, బీఆర్బి కో ఆర్డినేటర్ కే శిరీష, సీనియర్ సహాయకులు వెంకట్ రామ్, రేవంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎల్సిపివో ఏ సతీష్ కుమార్, సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి, శిరీష, కవిత, పద్మ, ప్రసూన , సుజన, రజిత, రమ, కల్పన, శిశు గృహ మేనేజర్ దూడమ్ నగేష్ ,కౌన్సిలర్ మాధవి, సోషల్ వర్కర్లు జీ సునీత,మెరుగు శ్రీనివాసులు,సంగీ చైతన్య, దివ్యాంగుల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ మెంబెర్స్ బిల్ల మహేందర్, నర్సమ్మ ,యాకయ్య, వీరభద్రమ్, వివిధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నార.