తెరాస పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గందే చిరంజీవి నియామకం
హుస్నాబాద్ నవంబర్ 22 జనంసాక్షి
హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి విభాగం (TRSV) అధ్యక్షుడిగా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన గందే చిరంజీవిని నియమిస్తూ హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారనీ TRS పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి, యూత్, సోషల్ మీడియా విభాగాల కో- ఆర్డినేటర్ సూరంపల్లి పరశు రామ్ ఒక ప్రకటన లో తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ లో క్రియశిలకంగా, ఏ కార్యక్రమం లో అయినా చురుకుగా పనిచేసే వ్యక్తి గా, విద్యార్థి యువత ను కలుపుకుని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్న గందే చిరంజీవి ని ఎమ్మెల్యే గుర్తించి హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు. కష్ట పడే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పటికైనా గుర్తింపు ఇస్తుంది అనేది గందే చిరంజీవి నియామకం ఇందుకు ఉదాహరణగా తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన TRSV హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు గందే చిరంజీవి మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ , అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేస్తానని,విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని నాపై నమ్మకంతో నన్ను హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు ఎమ్మెల్యే సతీశ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.




