వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
తిరుమలగిరి (సాగర్) నవంబరు 27 (జనంసాక్షి):
వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 3,500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇంచార్జి రమావత్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, టపాకాయలతో సంబరాలు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు,షర్మిల అభిమానులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు బాణావత్ రంగనాయక్ యూత్ అధ్యక్షులు హనుమా నాయక్ , రమవత్ పాండు, కుర్ర సురేష్,చిన్నముని,మైనర్, లాలూ,రాంసింగ్,ముని,హనుమంతు,రంగ, పెద్దముని, రాగ్య, చారీ,తదితరులు పాల్గొన్నారు.




