Saturday, 7 November 2026

రైతులకు ఎవరైనా సీడ్ ఆర్గనైజర్ కానీ దళారులు గాని రైతులకు మోసం చేసినట్లయితే పీడీ యాక్ట్ పెడతాం

రైతులకు ఎవరైనా సీడ్ ఆర్గనైజర్ కానీ దళారులు గాని రైతులకు మోసం చేసినట్లయితే పీడీ యాక్ట్ పెడతాం

ఎస్ఐ శేఖర్ రెడ్డి

వీణవంక నవంబర్27 (జనం సాక్షి ) వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన నూజివీడు సీడ్స్ కంపెనీ ఆర్గనైజర్ అయినా హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మారం రాజిరెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన దాసరి కొమురయ్య అనే రైతుకు నూజివీడు సీడ్స్ వరి ధాన్యం వేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సీడ్ ఇచ్చి వచ్చిన ధాన్యాన్ని రాజిరెడ్డి కొనుగోలు చేసి సుమారు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వవలసి ఉండగా ఇప్పుడు అప్పుడు అంటూ సంవత్సరం నుండి డబ్బులు ఇవ్వకుండా దాటి వేసి మోసం చేసిన విషయంలో రైతు దాసరి కొమురయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇక నుండి రైతులకు ఎవరైనా మోసం చేస్తే వారి పైన పిడిఆక్ట్ పెడతామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు