Wednesday, 4 November 2026

వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అదినేత్రి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
వై ఎస్ షర్మిల ఉస్మానియా ఆసుపత్రి లో ఉన్న సౌకర్యాలు చూడడానికి వెళ్తుంటే ఆమెను ఇంట్లో నుండి బయటకు రానివ్వకుండా ఇంట్లోనే నిర్భందించడం హేయమైన చర్య అని పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు అతహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో ఒక నియంతలా వ్యవహారిస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి లో సౌకర్యాలు సరిగా లేవని వచ్చిన ఫిర్యాదు లకు స్పందించి ఆసుపత్రి సందర్శనకు వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరిన షర్మిల ఇంటిని పోలీస్ లు ముట్టడించి ఆమెను ఇంటి నుండి బయటకు రానివ్వకుండా నిర్భందించడం సబబు కాదని వాపోయారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్చా హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తు ప్రతిపక్ష పార్టీ ల గొంతు నొక్కుతున్నారని తెలిపారు. వై ఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడి నుండి ప్రజా సమస్యల పై పోరాడుతున్నారని అది జీర్ణించుకోలేని ప్రభుత్వం అడుగడుగునా షర్మిల ను అరెస్ట్ లతో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  ఎన్నికల సమయం సమీపిస్తుండటం తో కేసీఆర్ కు భయం మొదలైందని వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసిపోయిందని అన్నారు.