Wednesday, 4 November 2026

విద్యార్థులు పరీక్షలను ఆహ్లాదకరంగా తీసుకోవాలి

.విద్యార్థులు పరీక్షలను ఆహ్లాదకరంగా తీసుకోవాలి.విద్యార్థులకు ప్యాడ్ పెన్నులు బహుకరణ.నాగర్ కర్నూల్ రీజియన్ చైర్మన్ అర్థం శ్రీనివాస్.నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామంలో వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్ అఫీషియల్ విసిట్ సందర్భంగా మంగళవారం గుడిపల్లి ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి జ్యోతి రమణ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అర్థం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలను భరించి మనలను చదివించిన మన తల్లిదండ్రులకు మనమిచ్చే గొప్ప కానుక మన విజయమేనని ఆయన అన్నారు. పదవ తరగతి పరీక్షల్లో జిపిఏ 10 సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల ముఖంలో కనిపించే ఆనందానికి అవధులు లేవని కాబట్టి విద్యార్థులు అందరూ జిపిఏ 10 సాధించే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు అనంతరం జిల్లా అడిషనల్ ట్రెజరర్ గంధం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్న మా సంస్థ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి జ్యోతి రమణ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గుడిపల్లి పాఠశాలలో 10/10 సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న 43 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు బహూకరించారు.ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ ఓరుగంటి శ్రీనివాసులు వాసవి క్లబ్ కార్యదర్శి కంచర్ల శ్యాంసుందర్ ట్రెజరర్ పోల రవికుమార్ గుడిపల్లి గ్రామ సర్పంచ్ అల్లమ్మ విద్య కమిటీ చైర్మన్ చిన్నయ్య గుడిపల్లి గ్రామ పెద్దలు నరసింహారెడ్డి బిల్ల కంటి రవికుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబు ఉపాధ్యాయులు  విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.