వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి: తెలకపల్లిలో వంతెన కింద చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన మొగులాల్‌ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.