పంజాగుట్ట: వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ తరుచూ పోలీసులకు పట్టుబడుతున్న ఇద్దరు నిర్వాహకులపై పంజాగుట్ట పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
రాజమండ్రికి చెందిన మాదిరెడ్డి జయమ్మ, విశాఖపట్నానికి చెందిన జి. రాణిపై పంజాగుట్ట పీఎస్ పరిధిలో 9కి పైగా కేసులు నమోదయ్యాయి. పాత కేసుల్లో జయమ్మ ప్రస్తుతం జైలులో ఉండగా… రాణి బెయిల్‌పై బుధవారం విడుదలైంది. ఇరువురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి నోటీసులు అందజేశామని సీఐ మోహన్‌కుమార్ చెప్పారు.




