హైదరాబాద్, మార్చి 23: వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యమిచ్చి రుణమాఫీ చేశామన్నారు. బ్యాంకులు ఒప్పుకోకపోయినా తాము రుణమాఫీకే ముందుకు పోయామని ఆయన అన్నారు.. ఇక్రిశాట్, నాబార్డుల సహకారంతో వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టామన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థను ఏర్పాటుచేసి, రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. వ్యవసాయాధార పరిశ్రమల ద్వారా వారికి అధిక ఆదాయం పెంచాలని చూస్తున్నామన్నారు.




