Thursday, 5 November 2026

వ్యవసాయ కూలీలకు కూలి బంధు – కూలి భీమా పథకాన్ని వర్తింప చేయాలి

వ్యవసాయ కూలీలకు
కూలి బంధు – కూలి భీమా పథకాన్ని వర్తింప చేయాలి
– వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనుంజయ నాయుడు హుజూర్ నగర్ డిసెంబర్ 15 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులకు కూలి బంధు, కూలి భీమా పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రైతుబంధు రైతు భీమా అమలు చేయడాన్ని హర్షిస్తున్నామని, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అని, ఆ వ్యవసాయంలో రైతుకు చేదోడు వాదోడుగా ఉన్న వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉండకపోవటం విచారకరమని అందువల్ల పాలకులు పెద్ద మనసుతో ఆలోచనచేసి మేధావులతో చర్చించి వ్యవసాయ కూలీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని, వారిలో ఉండేందుకు ఇల్లు లేని వారు అనేకమంది ఉన్నారని వారందరినీ గుర్తించి ఇల్లు, ఇళ్ల స్థలాలు అందించాలని, 50 సంవత్సరాల వ్యవసాయ కార్మికులకు ఐదువేల పెన్షన్ ఇవ్వాలని, జాబు కార్డు ఉన్న వ్యవసాయ కార్మికుడికి గృహ అవసరాల కోసం నెలకు 100 యూనిట్ల వరకుఉచిత విద్యుత్ అందించాలని, వ్యవసాయంలో యాత్రికరణ పెరిగిపోవడం వల్ల వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదని అందువల్ల మహాత్మ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి రెండు వందల రోజులు కల్పించి రోజుకు 700 రూపాయల వేతనంఇవ్వాలన్నారు. ఇందుకు కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంకోసం వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాలతో కూడిన బృందాన్ని కేరళ రాష్ట్రం తీసుకెళ్లి అధ్యయనం చేయాలని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, తెలంగాణ రాష్ట్ర కౌలు దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు చిలక రాజు శ్రీను, జడ వెంకన్న, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, హుజూర్ నగర్ పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి జిల్లా గౌరవాధ్యక్షుడు గోపన బోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు అమరారపు పున్నయ్య, రైతు సంఘం హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు జక్కుల రమేష్, ఉష పాల్గొన్నారు.