శ్రీ లక్ష్మీ సరస్వతీ సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు వినాయక నగర్ దేవస్థానం కమిటీ కొండమల్లేపల్లి డిసెంబర్ 15 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి పట్టణంలోని వినాయక నగర్ లో శ్రీ లక్ష్మీ సరస్వతీ సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయని ఆనందం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వినాయక నగర్ దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొండమల్లేపల్లి మండల ప్రజలకు దైవభక్తి, దాత గుణం నిండుగా ఉన్నాయని అందుకే భక్తి కార్యాలకు ముందుంటారని పేర్కొన్నారు ఇంతటి మహత్తర కార్యం జరగడానికి సహకరించిన దాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు ఈ దైవకార్యానికి నాంది పలికినందుకు దేవస్థాన కమిటీ సభ్యులు ప్రశంసించారు గత మూడు రోజులుగా తమ విలువైన సేవలు, సమయాన్ని కేటాయించిన భక్తులందరికీ పూర్వక శుభాకాంక్షలు కృతజ్ఞతలు అని తెలిపారు దేవుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారుఈ కార్యక్రమంలో డేరం జయప్రకాష్ శర్మ, ఘంటసాల శివప్రసాద్ శర్మ, వినాయక నగర్ దేవస్థానం కమిటీ సభ్యులు లింగాల మధుసూదన్ రెడ్డి, వరికుప్పల శ్రీనివాస్, కందుల వెంకట్ రెడ్డి, తొసుగుండ్ల సుధాకర్ రెడ్డి, పాక లక్ష్మయ్య, వరికుప్పల పాండు, బొమ్మిడి శ్రీనివాస్, తోటపల్లి శ్రీనివాస్, తోటపల్లి కిరణ్, తోటపల్లి వెంకటేశ్వర్లు, గోవర్ధనాచారి, బొడ్డుపల్లి వేణు , బత్తుల ఎల్లయ్య, అప్పన శ్రీనివాస్, బత్తుల జంగయ్య, ఎన్ యాదయ్య, మేడిపల్లి జంగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
శ్రీ లక్ష్మీ సరస్వతీ సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ




