ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బుధవారం ఉదయం అయ్యోరి రాజేష్ కుమార్ అధ్వర్యంలో పాలకవర్గ సాధారణ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశములో డిసెంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 మాసములు ఆదాయ వ్యయాలు 2023-24 సంవత్సరపు బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలు మరియు తదితర అంశముల పై చర్చించారు. ఈ సమావేశములో పురపాలక సంఘ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు వీరవేని రాజ మల్లయ్య, గైని మల్లేశం,మైనేని వెంకటి,మామిడి శ్రీనివాస్, చక్రాల శ్రీనివాస్, జంగా శ్రీనివాసు, గాజుల సత్తయ్య, మరియు సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖా అధికారి, మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశం




