Monday, 2 November 2026

డాక్టర్ ప్రీతి ఘటన పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలిడాక్టర్ ప్రీతి ఘటన పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి

కొడకండ్ల, మార్చి01(జనం సాక్షి)
వరంగల్ మెడికో డాక్టర్ ప్రీతి నాయక్ అకాల మరణం పట్ల చింతిస్తూ బుధవారం వారి స్వగ్రామం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండా లో బిజెపి నేతలు వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శోక సముద్రంలో మునిగి ఉన్న డాక్టర్ ప్రీతి గారి తల్లిదండ్రులను ఓదార్చి ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారని ఆ భగవంతుని ప్రార్థించి వారికి అన్ని విధాలా అండగా ఉంటాం అని విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ వరంగల్ మెడికో విద్యార్థి డాక్టర్ ప్రీతి నాయక్ బంగారు భవిష్యత్తు ను బుగ్గి పాలుచేసిన పాపం కేసీఆర్ సర్కారుదేనని, ర్యాగింగ్ గురించి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత ధారుణం జరిగేది కాదని, కళాశాల ప్రిన్సిపాల్ మరియు హెచ్వోడి లు కాలయాపన చేయడం ద్వారా సమస్య మరింత జటిలం అయి ప్రీతి మరణానికి దారి తీసింది అని,ఈఘటనపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపి ర్యాగింగ్ పేరుతో వేధించి ఆమె మరణానికి కారకుడైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.డాక్టర్ ప్రీతి  కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని,వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.మెడికల్ విద్యార్థినిలకు రక్షణ కల్పించలేని మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన సైఫ్ ను దిశ ఘటన మాదిరిగానే ఎన్ కౌంటర్ చేయాలని కోరారు.డాక్టర్ ప్రీతి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని ఈఘటనలో ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సుంకరనేని కోటేశ్వర్, జిల్లా నాయకులు పరుపాటి రాం మోహన్ రెడ్డి,కొడకండ్ల మండలం అధ్యక్షుడు పులిగిల్ల ఉపేందర్, తొర్రూరు మున్సిపాలిటీ అధ్యక్షుడు పల్లె కుమార్, తొర్రూరు రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్, నాయకులు ధరావత్ రాయుడు, సాయి, ధరావత్ అజయ్, తదితరులు పాల్గొన్నారు.