వ్యవసాయ విద్యుత్తు సరఫరాకు షెడ్యూల్‌

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): విద్యుత్‌ కోతలు ఆరంభం కావడంతో పంటలకు కూడా ఇక సమయ పాలన విధించారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్‌ విధించారు.   వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా వేళలను మార్చినట్లు విద్యుత్తుశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అంతటా ఈ విదానం అమల్లోకీ వస్తోంది. గ్రూప్‌ల వారీగా విద్యుత్తు సరఫరా వేళలను నిర్ణయించినట్లు చెప్పారు. ఏ-గ్రూప్‌ వారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7గంటల వరకు, అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, బి-గ్రూప్‌ వారికి ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సి-గ్రూప్‌ వారికి మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు, అర్ధరాత్రి 2గంటల నుంచి 3గంటల వరకు, డి- గ్రూప్‌ వారికి రాత్రి 9 గంటల నుంచి రెండు గంటల వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ మేరకు పంటలకు నీరు పెట్టుకునే విధంగా ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.